పూరి జగన్నాథ్.. మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్.హీరోలను ఏవిధంగా చూపెట్టాలో తనకు బాగా తెలుసు.తన సినిమాల్లో హీరోలకు సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది.చాలా సార్లు అవి క్లిక్ అయ్యి బ్లాక్ బాస్టర్లను ఇచ్చాయి.ఇలాంటి డైరెక్టర్ చేతిలో ట్యాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పడితే ఎలా ఉంటుంది. ఫలక్ నుమా దాస్ తో విశ్వక్ తనలోని మాస్ చూపించాడు.పూరి,విశ్వక్ కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా ఓ మంచి మాస్ సినిమా వస్తుంది.అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ ఈలోగానే వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇవి కాస్త విశ్వక్ కంటబడడంతో ఈవార్తలపై విశ్వక్ సేన్ స్పందించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలాక్స్ అవ్వండి,పూరి గారితో ఇంతవరకు ఎలాంటి చర్చలు జరుగలేదు మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రానుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఇంస్టాగ్రామ్ ద్వారా విశ్వక్ క్లారిటీ ఇచ్చాడు. దాంతో పూరి-విశ్వక్ కాంబినేషన్ లో సినిమా రానుందని వార్తలకు చెక్ పెట్టినట్లయింది.
ఇక గతంలో పూరి ప్లాపుల్లో వున్నపుడు రామ్ తో ఇస్మార్ శంకర్ తీసి బ్లాక్ బాస్టర్ హిట్ తో ట్రాక్ లో వచ్చాడు. ఆసినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ లైగర్ ను తీసాడు.అయితే ఇది నిరాశపరచడంతో పూరి ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నాడు.ఈ డైరెక్టర్ త్వరలోనే ఓ హీరోకు కథ వినిపించేదుకు రెడీ అవుతున్నాడట.
ఇక దాస్ కా ధమ్కీ తో సాలిడ్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్.ప్రస్తుతం విశ్వక్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి.అందులో ఒక సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.ఈసినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.మీనాక్షి చౌదరి హీరోయిన్.రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.
ఇక ఈసినిమా కాకుండా విశ్వక్ సేన్, చైతన్య కృష్ణ తో ఓ సినిమా చేస్తున్నాడు.ఇందులో నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ 4సినిమాస్,శ్రీకర స్టూడియోస్ నిర్మిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: