1000 మందితో గేమ్ ఛేంజర్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్

ram charan to fight thousands of goons in the game changer movie

లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం గ్యాప్ లేకుండా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షెడ్యూల్ ను స్టార్ట్ చేసేస్తున్నాడు. రీసెంట్ గానే శంకర్ ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ పూర్తి చేశాడు శంకర్. ఈనేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయబోతున్నామని కూడా అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు శంకర్. ప్రస్తుతం క్లైమాక్స్ పై కాన్సాట్రేషన్ పెట్టనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం శంకర్ భారీ స్థాయిలో క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుండి ఈ క్లైమాక్స్ ను ప్రారంభించి ఈ క్లైమాక్స్ చిత్రీకరణ వచ్చే నెల తొలివారం వరకూ జరుగుతుందని సమాచారం. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లో 1000మంది వరకూ పాల్గొంటారని తెలుస్తుంది. అంతేకాదు ఈయాక్షన్ సీక్వెన్స్ కే.జి.యఫ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, రవి ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా.. కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + 12 =