దసరా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ .. 

Dasara Movie To Be Out On Netflix Soon

నాని నటించిన దసరా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. కేవలం10రోజుల్లోనే ఈసినిమా 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మూడు వారాల్లో దసరా ప్రపంచ వ్యాప్తంగా 114కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.తెలుగు రాష్ట్రాల్లో 75కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది,ఇందులో షేర్ 44కోట్లు.నాని కెరీర్ లో ఇదే హైయెస్ట్ షేర్.ఈసినిమా నేటితో నాలుగోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది.అయితే ఇప్పటికి డీసెంట్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఒటిటి లోకి రానుంది. దసరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.దాంతో ఈనెల 27నుండి ఈసినిమా అన్ని సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ లోకి రానుంది.అయితే హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ ఎప్పుడవుతుందో మాత్రం నెట్ ఫ్లిక్స్ ప్రకటించలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా దీక్షిత్ శెట్టి,సాయి కుమార్,ఝాన్సీ కీలకపాత్రల్లో కనిపించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు.

ఇక ఈసినిమాతరువాత నాని ప్రస్తుతం తన 30వ సినిమాలో నటిస్తున్నాడు.ప్రస్తుతం గోవాలో నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఈసినిమాలో నాని,తండ్రి పాత్రలో కనిపించనున్నాడు.శౌర్యువ్ డైరెక్ట్ చేస్తుండగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఈసినిమా డిసెంబర్ 21న విడుదలకానుంది. సో నాని ఈఏడాది మరో సినిమాతో ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నాడు.మరి నాని30,నానికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + six =