క్లైమాక్స్ లో గేమ్ ఛేంజర్

shankar update on game changer movie

లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటి.. కమల్ హాసన్ హీరోోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా ఒకటి. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి రామ్ చరణ్ సినిమా కంటే ముందే ఇండియన్ 2 మొదలుపెట్టాడు శంకర్. అయితే మధ్యలో వివదాలు రావడంతో ఈసినిమా నుండి తప్పుకున్నాడు. ఆతరువాత చరణ్ సినిమాను మొదలుపెట్టాడు. చరణ్ సినిమా మొదలుపెట్టిన తరవాత ఇండియన్ 2 వివాదం ముగియడం.. ఈసినిమాను కూడా త్వరగా ముగించాలన్న ఒప్పందానికి రావడంతో శంకర్ అటు చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేసేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు ఇండియన్ 2 షూట్ తో బిజీగా ఉన్నాడు శంకర్, తైవాన్ లో అలాన్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని కీలక సన్నివేశాలు పూర్తి చేసుకున్నారు. ఈమేరకు శంకర్ తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చాడు. కమల్‌హాసన్‌ సార్‌ పవర్‌ ప్యాక్‌డ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. మళ్లీ మేలో కలుద్దాం. ఇక ఇండియన్‌ 2 నుంచి గేమ్‌ ఛేంజర్ క్లైమాక్స్‌ షూటింగ్‌కు వెళ్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు శంకర్‌. దీంతో ఒకేసారి రెండు సినిమాల అప్ డేట్లు ఇచ్చాడు శంకర్.

కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + thirteen =