ఏజెంట్ ట్రైలర్ పై చై, శేష్, తేజ్ రియాక్షన్

naga chaitanya adivi sesh and tej reaction on agent trailer

అఖిల్ హీరోగా, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఏజెంట్. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈసినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో ఈసినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ట్రైలర్ పై టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగ చైతన్య ఈ ట్రైలర్ పై స్పందిస్తూ వాట్ ఏ బ్లాక్ బస్టర్ ట్రైలర్ అంటూ పోస్ట్ చేయగా దానికి థాంక్యూ బిగ్ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాయి ధరమ్ తేజ్ స్పందిస్తూ.. మై డియర్ కెప్టెన్..చాలా వైల్డ్ గా ఉన్నావు..కొత్త మేకోవర్ లో చూడటం చాలా రిఫ్రెషింగ్ ఉంది.. మోర్ లవ్ అండ్ హ్యాపీనెస్ అంటూ చిత్రయూనిట్ బెస్ట్ విషెస్ అందించాడు..

ఇంకా అడివి శేష్ స్పందిస్తూ ఏజెంట్ వైల్డ్ టీజర్.. వైల్డ్ ఏజెంట్ కు ఏజెంట్ 116 తరపున కంగ్రాట్స్..నా ఫేవరెట్ అనిల్ సుంకరకు, అలానే సురేందర్ రెడ్డికి నా లవ్.. చిత్రయూనిట్ కు గుడ్ లక్ అంటూ పోస్ట్ చేశాడు.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 1 =