సమ్మర్ లో నిజమైన ‘దసరా’-అల్లు అర్జున్ 

Allu Arjun Heaps Praises on Nani's Dasara

ఈఏడాది వాల్తేరు వీరయ్య తరువాత ఆరేంజ్ హిట్ అనిపించుకుంది రీసెంట్ గా విడుదలైన దసరా.నాని నటించిన ఈసినిమా మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.పాన్ ఇండియా మూవీ గా విడుదలైన ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 113కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఈసినిమా నానికి చాలా రికార్డులను అందించింది.దసరాతో నాని 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఈసినిమా ఇప్పటివరకు 62కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో నాని కెరీర్ లో హైయెస్ట్ షేర్ మూవీగా నిలించింది.ఇంతకుముందు ఏంసిఏ హైయెస్ట్ షేర్ మూవీ గా ఉండేది.అలాగే దసరా యూఎస్ఏ లో 2మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో నాని మొదటిసారి2మిలియన్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.అలాగే నైజాంలో 25కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి అత్యధిక షేర్ ను సాధించిన సినిమాల జాబితాలో దసరా చోటు దక్కించుకుంది.ఓవరాల్ గా దసరా,నాని కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కామన్ ఆడియన్స్ ను మాత్రమే కాదు సినీ ప్రముఖులను కూడా మెప్పించింది.ఇప్పటికే ఈసినిమాపై మహేష్ బాబు,రాజమౌళి,సుకుమార్,చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించగా తాజాగా ఈ జాబితాలోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు.

తాజాగా సినిమా చూసిన అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దసరా టీంకు అభినందలు.. చాలా అద్భుతంగా తీశారు. నానితోపాటు కీర్తి మిగిలిన నటీనటులు చాలా బాగా నటించారు. సంతోష్ నారాయణన్ పాటలు,బీజీఎమ్ అదిరిపోయేలా ఇచ్చారు.సత్యాన్ సూర్యన్ కెమెరా వర్క్ సూపర్. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అద్భుతంగా తీసాడు.చెరుకూరి సుధాకర్ కు అలాగే టీం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు..సమ్మర్ లో నిజమైన దసరా అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − ten =