తమ అభిమాన హీరోలకు ఫ్యాన్స్ పెద్ద పెద్ద కటౌట్ లు పెడుతుంటారన్న విషయం తెలిసిందే. సినిమా రిలీజ్ కు ముందు నుండే ఆ ఏర్పాట్లలో ఉంటూ భారీ భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తుంటారు. ఈవిషయాల్లో కూడా ఫ్యాన్స్ కు పోటీ ఉంటుందనుకోండి. అయితే హీరోయిన్లకు అలాంటి భారీ కటౌట్లు పెట్టడం అనేది చాలా అరుదు. కానీ స్టార్ హీరోయిన్ సమంతకు అది మినహాయింపు అనేది మరోసారి నిరూపించుకుంది. ఇంటస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అయిపోతున్నా సమంత క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్ గా ఇంకా రాణిస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే సమంత కంటే వెనుక వచ్చిన హీరోయిన్లు కూడా ఇప్పుడు కనిపించడంలేదు. కానీ సమంత మాత్రం ఓ పక్కన సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్ చేస్తూ.. మరోవైపు లేడీ ఒరియెంటెండ్ సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇక సామ్ తో సినిమాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనుకాడట్లేదు. తన ఇమేజ్ దృష్ట్యా భారీ స్థాయిలో బజ్జెట్ పెట్టడానికి ముందుకొస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం సమంత నుండి వచ్చిన సినిమా శాకుంతలం. నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమా రిలీజ్ నేపథ్యంలో సమంత భారీ కటౌట్ ను ఏర్పాటు చేసారు. హైద్రాబాద్ లోని దేవి 70 ఎమ్ఎమ్ థియేటర్ వద్ద ఈ భారీ కటౌట్ ఎర్పాటు చేశారు. గతంలో ఏ బేబీ ఇంకా యశోద సినిమాలకు కూడా ఇలానే భారీ భారీ కటౌట్లు పెట్టారు. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రేంజ్ లో ఈ కటౌట్ పెట్టడం చూస్తుంటే సమంత క్రేజ్ ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: