నటీనటులు :సమంత,దేవ్ మోహన్,మోహన్ బాబు,ప్రకాష్ రాజ్,అల్లు అర్హ
సంగీతం : మణిశర్మ
ఎడిటింగ్ :ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ :శేఖర్ వి జోసెఫ్
దర్శకత్వం :గుణశేఖర్
నిర్మాత : నీలిమ గుణ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రుద్రమదేవి తో చారిత్రక కథను ప్రేక్షకులను అందించిన దర్శకుడు గుణశేఖర్.. ఈ సారి శాకుంతలం అనే పురాణ గాధతో ప్రేక్షకులముందుకు వచ్చాడు.మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు.సమంత టైటిల్ రోల్ లో నటించడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది.ఇక ఈ రోజు థియేటర్లలోకి వచ్చిన ఈచిత్రం ఎలావుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
విశ్వామిత్రుడి తప్పసుకు భంగం కలిగించడానికి భూలోకం వచ్చినమేనకా ..అతని తో ప్రేమలో పడి ఓ ఆడ బిడ్డకు జన్మనిస్తుంది. అయితే నరుడు వల్ల పుట్టిన బిడ్డకు దేవ లోకంలోకి ప్రవేశం ఉండదు దాంతో ఆ బిడ్డను అక్కడే వదిలేసి మేనక వెళ్ళిపోతుంది.తరువాత శాకుంతల పక్షులు ఆబిడ్డను కణ్వ ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తాయి.ఆబిడ్డను చూసిన క్వణ మహర్షి శకుంతల అని పేరు పెట్టి పెంచుకుంటాడు.ఒకానొక సందర్భంలో కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గర సేదతీరుతాడు దుష్యంతుడు.ఆసమయంలో అక్కడే వున్న శకుంతల( సమంత) ను చూసి మనసు పడతాడు.శంకుతల కూడా దుష్యంతుడిని ఇష్టపడడంతో ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుంటారు.ఆతరువాత దుష్యంతుడు…తన రాజ్యానికి వెళ్లి వచ్చి రాచమర్యాదలతో నిన్ను తీసుకెళ్తానని శకుంతలకు ఒక ఉంగరం ఇచ్చి వెళ్ళిపోతాడు.కొన్నాళ్ళకు శకుంతల గర్భవతి అవుతుంది.ఇక దుష్యంతుడు ఎంతకీ రాకపోవడంతో శంకుతలనే అతని దగ్గరికి పంపిస్తాడు కణ్వమహర్షి.కానీ దుష్యంతుడు ఆమెను అంగీకరించడు.ఆతరువాత ఏం జరిగింది?చివరకు దుష్యంతుడుశకుంతల కలిసారా? అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
అభిజ్ఞాన శంకుతలంలో రాసిన ప్రేమకావ్యాన్ని తెరమీదకు తీసుకురావాలని చేసిన ప్రయత్నానికి ముందు గుణశేఖర్ ను మెచ్చుకోవాల్సిందే.ఇక ఆప్రయత్నంలో విజయం సాదించాడనే చెప్పొచ్చు.సినిమాను 3డి లోకూడా చూపించాడు.శకుంతల పాత్రకు సమంత అలాగే దుష్యంతుడి పాత్రకు దేవ్ మోహన్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.శకుంతల పాత్రలో సమంత నటన ఆకట్టుకుంటుంది.శకుంతల పాత్ర,సమంత కెరీర్ లో బెస్ట్ రోల్ గా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సమంత తన అనుభవాన్ని చూపెట్టింది.దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కూడా చాలా బాగా నటించాడు.దుర్వాసముని పాత్ర మోహన్ బాబు కు బాగా సూట్ అయ్యింది.ప్రీ క్లైమాక్స్ లో కనిపించిన అల్లు అర్హ తన క్యూట్ యాక్టింగ్ తో థ్రిల్ చేసింది.తెర మీద ఇంకా చాలా మంది తెలిసిన నటీనటులు కనిపిస్తారు.వీళ్ళంత తమ పాత్రల పరిధి మేర చేశారు.
మొదటి భాగంలో దుష్యంతుడు,శకుంతల మధ్య ప్రేమ ఆతరువాత దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లిపోవడం ఇంటర్వెల్ కు ముందు దుర్వాసముని పాత్ర ఎంట్రీ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.ఫస్ట్ హాఫ్ లో గుణశేఖర్ మార్క్ ఫ్రేమ్స్ ఆకట్టుకుంటాయి.ఇక రెండవ భాగంలో దుష్యంతుడుని వెతుక్కుంటూ శకుంతల వెళ్లడం మధ్యలో శకుంతల,దుర్వాసముని శాపానికి గురికావడం ఆ తరువాత రాజ్యానికి వెళ్ళాక శకుంతలను అవమానపరచడం ఆతరువాత దుష్యంతుడు ఎందుకు మారాల్సివచ్చింది చివరికి కథ ఎలా సుఖాంతమైంది అనేది చూపెట్టారు.చివర్లో భరతుడిగా అల్లు అర్హ ఎంట్రీ సినిమాకు ఫ్రెష్ నెస్ ను తీసుకొచ్చింది.ఇక ఈపాత్రలో అర్హ నటన సినిమాలో ఓహైలైట్ అని చెప్పొచ్చు.తన క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది.భారీ డైలాగులను స్పష్టంగా చెప్పింది.సినిమాల్లోకి అర్హకు ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు.
ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అద్భుతమైన ప్రేమ కావ్యాన్నిఅంతే అద్భుతంగా తెరకెక్కించడంలో గుణశేఖర్ సక్సెస్ అయ్యాడు.అలాగే మణిశర్మ అందించిన పాటలు డీసెంట్ గా వున్నాయి అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తన మార్క్ చూపించాడు.శేఖర్ వి జోసెఫ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.విజువల్స్ బాగున్నాయి.ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది.రన్ టైం కూడా తక్కువగా ఉండడం సినిమాకు ప్లస్ అయ్యింది.నిర్మాత నీలిమ గుణ సినిమాకు బాగా ఖర్చు చేసింది.
ఓవరాల్ గా మైథలాజి బ్యాక్ డ్రాప్ లో వచ్చిన శాకుంతలంలో సమంత ,దేవ్ మోహన్,అల్లు అర్హ ల నటన, మణిశర్మ మ్యూజిక్ సినిమాలో హైలైట్ అయ్యాయి.పురాణగాధల్లోని ఓ అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరమీదకు తీసుకొచ్చి నవతరం ప్రేక్షకులకు అందించడంలో గుణ శేఖర్ సక్సెస్ అయ్యాడు.
శాకుంతలం రిలీజ్ ట్రైలర్👇:
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.