ఉస్తాద్ భగత్ సింగ్- పవన్, శ్రీలీల తో ఒక మాస్ స్టెప్

crazy update on pawan kalyans ustad bhagat singh movie

యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. గతంలో హీరోయిన్లు మాదిరి కాకుండా శ్రీలీల కెరీర్ స్టార్టింగ్ నుండే అటు యంగ్ హీరోలతో చేస్తూనే మరోపక్క సీనియర్ హీరోలతో కూడా నటించేస్తుంది. రీసెంట్ గానే ధమాకా రవితేజ పక్కన నటించి రవితేజ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో తన నటనతో, డ్యాన్స్ తో పోటీ ఇచ్చింది. ఆ సినిమాలో శ్రీలీల నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం అయితే వరుస సినిమాతో బిజీగా ఉంది ఈ అమ్మడు. అటు రామ్, నితిన్ లాంటి హీరోలతో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, బాలకృష్ణ 108 సినిమా ఇలా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో ఓక కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా షూట్ లో శ్రీలీల కూడా పాల్గొంది. ఇదిలా ఉండగాా తాజాగా ఈసినిమాపై క్రేజీ వార్త ఒక్కటి చక్కర్లు కొడుతుంది. దానికి కారణం హరీష్ శంకర్ ట్వీటే కారణం. ఎప్పటిలాగే ఓ నెటిజన్ ఈసినిమా గురించి ట్వీట్ చేస్తూ.. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ ఇంకా శ్రీలీల తో కలిపి ఒక మాస్ స్టెప్ వేయించన్న అంటూ హరీష్ శంకర్ ను కోరగా.. అందుకు హరీష్ శంకర్ కూడా థమ్స్ అప్ సింబల్ ను పెట్టి ఒకే అన్నట్టు రిప్లై ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. పవన్-శ్రీలీల తో హరీష్ ఖచ్చితంగా ఒక మాస్ స్టెప్ వేయిస్తాడని అనుకుంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో..

కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. మరి చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =