రాముడి పాత్ర మహేష్ కు బ్రహ్మాండంగ ఉంటుంది

gunasekhar interesting comments on mahesh babu about mythological role

మహేష్ శ్రీరాముడి పాత్ర చాలా బాగా సూట్ అవుతుంది… ఈ మాటలు అన్నది ఎవరో కాదు క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్. గుణశేఖర్ అనడం ఏమో కానీ మహేష్ ను శ్రీరాముడు పాత్రలో ఊహించుకుంటుంటూనే చాలా థ్రిల్లింగ్ ఉంది. గుణశేఖర్ తెరకెక్కించిన మైథలాజికల్ సినిమా శాకుంతలం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ వస్తున్నారు గుణశేఖర్. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గుణశేఖర్ మైథలాజికల్ పాత్రల గురించి వచ్చిన సందర్భంలో మహేష్ బాబు గురించి అడుగగా అందుకు.. మహేష్ బాబు ను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి.. మహేష్ గురించి తెలిసిన వారికి తెలుస్తుంది.. మాములుగా ఒక లుంగీ కట్టమంటేనే చాలా సిగ్గుపడతాడు.. పోలీసు పాత్ర వేయడానికే తనకు చాలా టైమ్ పట్టింది.. పోకిరీ ముందు చాలా పోలీసు పాత్రలు వచ్చాయి.. కానీ అన్నీ వద్దనుకున్నాడు.. పోకిరీలో లాస్ట్ లో ఒక్క బిట్ మాత్రమే ఉంటుందని చెేశాడు.. తనకు ఏదో మారు వేషం వేసినట్టు అనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైథలాజికల్ పాత్రల్లో కూడా తనకు సూటయ్యే పాత్రలు చాలా ఉన్నాయి.. తన ఫీచర్స్ అన్నీ షార్ప్ గా ఉంటాయి.. అన్ని పురాణపాత్రలకు బాగుంటాడు.. అయితే జాగ్రత్తగా మౌల్డ్ చేయాలి అని తెలిపాడు.. ఇంకా ఒక విజల్ లో ఏ పాత్రకి బాగుంటాడని అనిపిస్తుంది అన్న ప్రశ్నకు శ్రీరాముడిగా బ్రహ్మాండంగా సెట్ అవుతాడు అని తెలిపారు. ప్యూచర్ లో అలాంటి అవకాశం వచ్చి తను చేస్తే చాలా బాగుంటుందని తెలిపాడు. మరి చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా పురాణపాత్రల్లో మహేష్ నటించే అవకాశం ఉంటుందేమో..

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

కాగా రాజకుమారుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ కు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా సంచలన విజయం అందించడంతో పాటు స్టార్ హీరో రేంజ్ కు తీసుకెళ్లింది. ఇక ఆ తరువాత వచ్చిన అర్జున్, సైనికుడు సినిమాలు మాత్రం కాస్త నిరాశ పరిచాయి. మరి వీరిద్దరి కాంబినేషన్ లో ఫ్యూచర్ లో ఏమైనా సినిమా వస్తుందో.. ఒకవేళ మహేష్ తో పురాణ పాత్రలు చేస్తే.. మహేష్ ను శ్రీరాముడి పాత్రలో చూపించాల్సి వస్తే గుణశేఖరే చూపిస్తాడేమో చూడాలి..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 17 =