క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈసినిమాను రూపొందించాడు గుణశేఖర్. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్వీట్ విషెస్ తెలియచేశాడు. తన ట్విట్టర్ లో సమంత గురించి చెబుతూ సామ్ నువ్వు చాలా ప్రేమతో ఉంటావు.. ఎప్పుడూ రైట్ చేయాలనే అనుకుంటావు.. ప్రతి షాట్ లోనూ నీ స్ట్రెంత్ మొత్తం పెట్టేస్తావు.. గత ఏడాది కాలంగా నువ్వు ఎలాంటి పోరాటం చేశావో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు.. కానీ నీ శరీరానికి రెస్ట్ అవసరం అయినా కూడా నీ చిరునవ్వుతో ఎప్పుడూ నీ టీమ్ ను, సినిమాను ముందుకు తీసుకెళ్తావు.. నీకు రేపు రిలీజ్ కాబోతున్న శాకుంతలం సినిమాకు బెస్ట్ విషెస్.. నీ సామర్థ్యం.. మిలియన్ల ప్రేమ నిన్ను ఎప్పుడూ క్షేమంగానే ఉంచుతాయి అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Shaakuntalam @Samanthaprabhu2 🤗 pic.twitter.com/Ym9D55aX1Y
— Vijay Deverakonda (@TheDeverakonda) April 13, 2023
ఇక ఇప్పటికే సమంత, విజయ్ దేవరకొండ కలిసి మహానటి సినిమాలో నటించారు. అప్పుడే వీరి కాంబినేషన్ ఆడియన్స్ కు నచ్చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో ఖుషి అనే సినిమా వస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. రీసెంట్ గానే మళ్లీ ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టింది. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: