పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్ బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఫ్యాన్స్ కూడా అకీరా నందన్ ఎప్పుడూ ఇండస్ట్రీ ఇస్తాడా అని ఎప్పటినుండో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సైలెంట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చేశాడు అకీరా నందన్. రేణూ దేశాయ్ మొదటి నుండీ అకీరాకు హీరో అవ్వాలనే ఇంట్రస్ట్ లేదు అని చెప్పినట్టే అకీరా కూడా హీరో గా కాకుండా వేరే క్రాఫ్ట్ వైపు వెళ్లాడు. మొదటి నుండి అకీరాకు మ్యూజిక్ అంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే కదా. ఆ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాటను కీ బోర్డ్ ద్వారా ప్లే చేసి ఇప్పుడే ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నాడు.
తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. రైటర్స్ బ్లాక్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఈ షార్ట్ ఫిలిమ్ కు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఒక రచయిత కథను రాయడానికి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనే నేపథ్యంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించారు. దీనికి కార్తికేయ యార్లగడ్డ రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ వీడియోకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ ఆకట్టుకోవడంతో అకీరాకు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి ఫ్యూచర్ ఉండొచ్చని అంటున్నారు. మరి చూద్దాం సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాడేమో..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























