సమాజ సేవ చేయడంలో ముందుంటాడు ప్రముఖ డ్యాన్సర్ ,హీరో,డైరెక్టర్ రాఘవ లారెన్స్.తన పేరుమీద ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందించడం,చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయించడం వంటి కార్యకమాలు చేస్తుంటాడు.ఇక మరోసారి గొప్ప మనుసు చాటుకున్నాడు లారెన్స్. రెండు రోజుల క్రితం రుద్రన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు విద్య ను అందించనున్నానని లారెన్స్ అన్నాడు. అందుకు సంబందించిన ఫొటో ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రెస్పెక్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. అలా లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
RESPECT 🤍
— Allu Arjun (@alluarjun) April 13, 2023
ఇదిలావుంటే కాంచన తో తెలుగులో కూడా ఫాలోయింగ్ ను ఏర్పచుకున్నాడు లారెన్స్. తాను హీరోగా నటించిలేటెస్ట్ మూవీ రుద్రుడు. ఈసినిమా తమిళ్ తోపాటు తెలుగు,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలవుతుంది. ఈసినిమా,లారెన్స్ కు వున్న బ్రాండ్ వల్ల తెలుగులో కూడా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కథిరేసన్ డైరెక్ట్ చేసిన ఈచిత్రంలో శరత్ కుమార్ విలన్ పాత్రలో నటించగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది.
ఇక ప్రస్తుతం లారెన్స్, చంద్రముఖి 2లో నటిస్తున్నాడు. బ్లాక్ బాస్టర్ మూవీ చంద్రముఖి కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తుండగా రాధికా,వడివేలు,లక్ష్మి మీనన్,మహిమ నంబియార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.పి వాసు డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: