తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా హీరోగా వస్తున్న సినిమా జవాన్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటి నుండి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ పఠాన్ తో వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ బద్దలు కొట్టాడు. దీంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమా షూటింగ్ లో నయన్ కూడా గత ఏడాది నుండి పాల్గొంటుంది. అప్పటి నుండి అటు చెన్నై, ఇంకా ముంబై షెడ్యూల్స్ లో పాల్గొంటూ షూటింగ్ ను పూర్తి చేస్తుంది. ఇక మార్చి ఫస్ట్ వీక్ లో నయన్ ఈసినిమా షూటింగ్ లో పాల్గొనగా అప్పుడు పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇద్దరి పిల్లల పేరెంటింగ్ నేపథ్యంలో కొంతకాలం నయన్ బ్రేక్ తీసుకుంది. ఇక తాజాగా నేడు మళ్లీ షూట్ మొదలైంది. ప్రస్తుతం ఒక సాంగ్ చిత్రీకరణ జరుపుతున్నారు. బాంద్రా ఫోర్ట్ లో షారుఖ్, నయన్ మధ్య సాంగ్ ను షూట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలో విజయ్ సేతుపతి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్ 2న రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: