పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన ఫైర్ ను చూపించాడు అల్లు అర్జున్. ఈసినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన పుష్ప సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చింది. ఇక రా అంట్ రస్టిక్ గా అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్, డైలాగ్స్, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. దేశవ్యాప్తంగా ఈసినిమా తన సత్తాను చాటింది. నార్త్ లో కూడా ఈసినిమా మేనియా చాలా రోజుల వరకూ కొనసాగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఎదురుచూస్తుంది పార్ట్ 2 కోసం. పార్ట్ 2 మొదలుపెట్టడానికే చాలా టైమ్ తీసుకున్నారు మేకర్స్. పార్ట్ 1 సంచలనం సృష్టిచడంతో పార్ట్ 2 కోసం సాలిడ్ కథను తయారు చేయడానికి చాలా టైమ్ తీసుకున్నాడు సుకుమార్. అందుకే షూటింగ్ నే చాలా లేట్ గా మొదలుపెట్టారు. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే ఈసినిమా నుండి ఇప్పటి వరకూ ఒక్క అప్డేట్ లేకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈనేపథ్యంలో తాజాగా సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది చిత్రయూనిట్ నుండి. అప్డేట్స్ వస్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజున మూవీ నుంచి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Updates rolling soon! #PushpaTheRule ❤️🔥🤙 pic.twitter.com/I4Zn1yxwmB
— Pushpa (@PushpaMovie) March 31, 2023
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది. మరి మొదటి పార్ట్ తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్ తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: