సూపర్ స్టార్ బర్త్ డే కి మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్

superstar krishna mosagallaku mosagadu movie re release announcement

స్టార్ హీరోల సినిమాలకు వారి పుట్టినరోజులకు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎంతో మంది హీరోల సినిమాలను రీరిలీజ్ చేశారు. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా తన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయగా అది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడు తాజాగా మరో క్లాసిక్ మూవీ రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. అది సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాళ్లు సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి తెరపై కృష్ణ చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో మొదటి 70 ఎమ్‌ఎమ్‌ సినిమా… తెలుగులో మొదటి కౌబాయ్‌ చిత్రం, జేమ్స్‌ బాండ్‌ చిత్రాలతో పాటు ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి రికార్డు సాధించారు.

`మోసగాళ్లకు మోసగాడు` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు కౌబాయ్‌ని ప‌రిచ‌యం చేశారు. హాలివుడ్‌ స్థాయిలో తీసిన ఈ చిత్రం ట్రెజర్‌ హంట్‌ పేరుతో విదేశీ భాషల‌కు అను వాదమైన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు మోసగాళ్లకు మోసగాడు చిత్రం 56 దేశాల్లో విడుదల అయ్యి రికార్డు సాధించింది. అప్పటి వరకు ఏ ఇండియన్‌ సినిమా కూడా అంత పెద్ద స్థాయిలో విడుదల అయ్యింది లేదు. హాలీవుడ్‌లో డబ్బింగ్‌ అయిన మొదటి ఇండియన్‌ సినిమాగా కూడా మోసగాళ్లకు మోసగాడు చిత్రం నిలిచింది.

ఇక ఇప్పుడు ఈసినిమాను మరోసారి సినీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మే 31వ తేదీన కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమాను 4కే వెర్షన్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ఇక ఈ ప్రకటనతో అటు కృష్ణ అభిమానులతో పాటు మహేష్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.