500 మంది ఫైటర్స్ తో కళ్యాణ్ రామ్ యాక్షన్ సీన్ హైలైట్ గా డెవిల్

Kalyan Ram's Devil Movie Climax Action Sequence With 500 People

నటుడు , నిర్మాతగా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం దర్శకత్వంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ నేపథ్యంతో తెరకెక్కుతున్న పీరియాడికల్ డెవిల్ మూవీ లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ లుక్ డిఫరెంట్ గా ఉండబోతుంది. సైలెంట్ గా సినిమా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ నుంచి చిత్ర యూనిట్ ఉగాది పండగ సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డెవిల్ మూవీ లో 500 మందితో యాక్షన్ సీక్వెన్స్ దర్శకుడు తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో తెరకెక్కుతున్న ఈ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ టాలీవుడ్ బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్‌లలో ఒకటిగా ఉంటుందనీ , డెవిల్ మూవీ కి హైలైట్ కానుందనీ సమాచారం. స్పై థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సంయుక్త మరియు మాళవిక నాయర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =