నటీనటులు : నాని , కీర్తి సురేష్ ,దీక్షిత్ శెట్టి , సాయి కుమార్ , సముధ్రఖని
సంగీతం : సంతోష్ నారాయణన్
దర్శకత్వం : శ్రీకాంత్ ఓదెల
సినిమాటోగ్రఫీ : సత్యాన్ సూర్యన్
ఎడిటింగ్ : నవీన్ నూలి
నిర్మాత : చెరుకూరి సుధాకర్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
న్యాచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మూవీ దసరా రేపు థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ , ట్రైలర్ , దసరా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సూపర్ గా వున్నాయి. దాంతో నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈసినిమాతో నాని పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇంత భారీ హైప్ తో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
తెలంగాణ లోని గోదావరి ఖని లో వున్న బొగ్గు గనుల నేపథ్యంలో జరిగే కథ ఇది. స్నేహం , ప్రేమ ,పగ ఈమూడింటీ చుట్టే కథ తిరుగుతుంది. ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్ ) ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. ఈక్రమంలో ధరణి ,ఊర్లో సమస్యలు మొదలవుతాయి. ఇంతకీ ఆ సమస్యలేంటీ, దానివల్ల ధరణి ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు చివరికి ఏం జరిగింది అనేదే మిగితా కథ.
పెరఫార్మెన్స్ :
సినిమాలో నాని నట విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. నాని తన కెరీర్ లో మొదటి సారి ఊర మాస్ పాత్రలో కనిపించాడు. ఇక ఆ పాత్రలో నాని నటన చాలా బాగుంది. ముఖ్యంగా ఎమోషన్స్ ను పలికించిన విధానం చాలా బాగుంది. ధరణి పాత్ర,నాని కెరీర్ లోనే బెస్ట్ రోల్ గా మిగిలిపోతుంది. వెన్నెల పాత్ర ఈసినిమాలో మరో హైలైట్. ఆపాత్రలో నటించిన కీర్తి సురేష్, మహానటి తరువాత ఆ రేంజ్ లో దసరాలో నటించింది. తన పాత్ర చాలా బాగుంది. నాని, కీర్తి కెమిస్ట్రీ అదిరిపోయింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షుకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాగే మిగితా కీలక పాత్రల్లో నటించిన దీక్షిత్ శెట్టి , సాయి కుమార్ , సముధ్రఖని , జరినా వాహబ్, పూర్ణ వారి రోల్స్ కి న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం :
మొదటి సినిమాతోనే అద్భుతమైన అవుట్ ఫుట్ ను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. కథ దగ్గర్నుండి నటీనటులు , టెక్నీషియన్స్ ఇలా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమా ను అద్భుతంగా తెరకెక్కించాడు. ఈసినిమా తర్వాత శ్రీకాంత్ తొందర్లోనే స్టార్ డైరెక్టర్ ల లీగ్ లో చేరేలాగే వున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతం సినిమాకు మరో హైలైట్. సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకు ప్రాణం పోశాడు. చాలా సన్నివేశాలను బీజీఎమ్ హెలైట్ చేసింది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సినిమాకి ప్లస్. విజువల్స్ బాగున్నాయి. నిర్మాత సుధాకర్ చెరుకూరి, దసరాకు బాగానే ఖర్చు చేశాడు.
తీర్పు :
ఓవరాల్ గా భారీ అంచనాలతో రేపు విడుదలకానున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకొని నాని కెరీర్ లో బిగ్గెస్ హిట్ గా నిలువడం ఖాయం. నాని , కీర్తి సురేష్ ల నటన , యాక్షన్ సన్నివేశాలు , సంగీతం సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. నాని ఫ్యాన్స్ కు మాత్రం దసరా తో పండగే.
దసరా ట్రైలర్:
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: