బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు దసరా అనే డిఫరెంట్ కథతో ఈసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు చేయని డీ గ్లామర్ పాత్రలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమా మార్చి 30 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని ఈసినిమా షూటింగ్ ఫస్ట్ డే ఎక్స్ పీరియన్స్ గురించి చెబుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. నాని బాగా చేస్తాడు అని అందరూ అంటూ ఉంటారు .. న్యాచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. దాంతో అదే కాన్ఫిడెంట్ తో దసరా షూటింగ్ కు బయలుదేరాను. ఇక షూటింగ్ లో ధరణి పాత్రలో అదరగొట్టేసి .. శ్రీకాంత్ ను థ్రిల్ చేయాలని అనుకున్నాను. లొకేషన్ కి వెళ్లి మేకప్ వేయించుకుని షూటింగ్ ను మొదలుపెట్టాను. అయితే ఎన్నిమార్లు ఎన్ని రకాలుగా చేసి చూపించినా శ్రీకాంత్ ఓకే అనడం లేదు. టేకుల మీద టేకులు అవుతున్నాయి. ఓకే చెప్పకపోగా కావాలంటే బ్రేక్ తీసుకోండి అని అన్నాడు. దాంతో నాకు యాక్టింగ్ రాదేమో అనే డౌట్ వచ్చింది. 15 ఏళ్లుగా చేస్తున్నాననే ఇగో హర్ట్ అయింది. బ్రేక్ తీసుకున్నప్పుడు .. ధరణి పాత్ర ఎలా ఉంటుందో శ్రీకాంత్ మరోసారి చెప్పాడు. ఆ తరువాత టేక్ ఓకే అయింది అని చెప్పుకొచ్చాడు.
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: