హీరో నాని దసరా మూవీ ఎక్స్ పీరియన్స్

Nani Reveals His Dasara Movie Experience

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా మూవీ ఎక్స్ పీరియన్స్ గురించి హీరో నాని ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఈ మూవీలోని ఒక సన్నివేశం తనని ఎంతగా వేధించిందో చెప్పారు. బొగ్గు తీసుకోని వెళ్తున్న డంపర్ ట్రక్ లో నాని కూడా ఉంటారు. ఒక చోటుకి వెళ్ళాక, ఆ ట్రక్ బొగ్గుని డంప్ చేయడంతో.. నాని కింద పడి, నానిపై బొగ్గు పడే సీన్. ఆ సన్నివేశం కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారనీ, సింథటిక్ బొగ్గుతో పాటు ట్రక్ లో కొంచెం డస్ట్ కూడా నింపారనీ, ఇక తన పై బొగ్గు పడి సీన్ కంప్లీట్ అయ్యి, సెట్ బాయ్స్ వచ్చి తనని బొగ్గు నుంచి బయటకి తీసేవరకు గాలి పీల్చుకోకుండా ఉండాలనీ.. ఒకవేళ గాలి పిలిస్తే, ఆ డస్ట్ లోపలికి వెళ్ళిపోతుందనీ.. ఎలాగైతే ఆ సీన్ పూర్తి చేశామనీ.. కానీ ఆ సీన్ తనని రెండు నెలలు పాటు వెంటాడిందనీ.. కింద పడడం, బొగ్గు తన పై పడడం, పైకి లాగడం పదే పదే గుర్తుకు వచ్చి ఇబ్బంది పడినట్లు నాని చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 2 =