పవన్ కోసం ముంబై సెట్

mumbai city erecting for pawan kalyan and sujeeth movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తరువాత వరుస సినిమాలను లైన్ పెట్టేస్తున్నాడు. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉంటున్నా కూడా డేట్స్ కేటాయిస్తూ షూటింగ్ లను పూర్తి చేస్తున్నాడు. పవన్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉండగా.. బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాల్లో షూటింగ్ లలో పాల్గొని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు సినిమా చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా ఉండగానే సముద్రఖనితో సినిమాను మొదలుపెట్టేశాడు. అంతేకాదు ఈసినిమా షూటింగ్ లో పాల్గొని ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన పోర్షన్ చాలా వరకూ పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను త్వరలోనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ మేరకు పనులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా ముంబై ఇంకా జపాన్ బ్యాక్ డ్రాప్ లో ఉండనున్నట్టు కూడా ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే పవన్ కోసం ముంబై సిటీ సెట్ ను వేస్తున్నారట. హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ముంబై సిటికి సంబంధించిన సెట్ ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు పవన్ ప్రస్తుతం 10రోజులు షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

కాగా ఈసినిమాను డీవీవీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. ఈసినిమాలో నటించే నటీనటులు, ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =