చంద్రముఖి 2 మూవీ లో తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసిన కంగనా రనౌత్

Kangana Ranaut Wraps Up Shoot For Her Part In Chandramukhi 2

శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. లెజెండ‌రీ కమెడియ‌న్ వ‌డివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రముఖి పాత్రలో నటించిన స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి 2 మూవీ లో తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసినట్టుగా సోషల్ మీడియా లో వెల్లడించారు. ఇవాళ్టితో చంద్రముఖి 2లోతన పాత్ర షూటింగ్ పూర్తయిందనీ , తాను కలిసిన చాలా మంది వ్యక్తులకు బై చెప్పడం చాలా కష్టంగా ఉందనీ , లారెన్స్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్ , కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు మాత్రమే కాదు మంచి మనిషి కూడా.అనీ , తనను సెట్ లో బాగా చూసుకున్నందుకు, నవ్వించినందుకు,పుట్టిన రోజుకు బహుమతులు అందించినందుకు ధన్యవాదాలు సర్ అనీ , మీతో పనిచేయడం చాలా గొప్ప విషయం అనీ , మన చిత్ర యూనిట్ మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా అవుతారనీ , అందరం కలిసి పనిచేస్తాం. సడెన్ గా ఆ పని అయిపోయింది అని వదిలి వెళ్ళేటప్పుడు అంత సులభం కాదనీ , మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు కన్నీళ్లు ఆగట్లేదు అనీ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టి కంగనా లారెన్స్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =