పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆదిపురుష్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఈసినిమాను ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ బెస్ట్ అవుట్ పుట్ కోసం చిత్రయూనిట్ రిలీజ్ ను వాయిదా వేసింది. ఈనేపథ్యంలోనే జూన్ 16వ తేదీన ఈసినిమా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఆ దిశగానే పనులు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే సినిమా బెటర్ అవుట్ పుట్ కోసం మేకర్స్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పనులు అన్నీ హైదరాబాద్ లో జరుగుతున్నట్టుగా సమాచారం. చూద్దాం మరి ఈసినిమా ప్రమోషన్స్ ను ఓం రౌత్ ఎంత భారీగా ప్లాన్ చేశాడో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: