నందమూరి నటసింహం బాలకృష్ణ న్యూ లుక్

Nandamuri Balakrishna New Look Goes Viral

అఖండ, వీర సింహారెడ్డి వంటి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో దూసుకుపోతోన్న నందమూరి బాలకృష్ణ #NBK 108 మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK108 మూవీ తెరకెక్కుతుంది. కాజల్ అగర్వాల్ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీలో శరత్ కుమార్, శ్రీ లీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్ ఫాంలో ఉన్న సీనియర్ హీరోగా మారారు. సినిమాలతో పాటు ఓటీటీ షో లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆహాలో గతంలో వచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్ ఫైనల్ ఎపిసోడ్‌లో సందడి చేసిన బాలయ్య, ఆ షోకే హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 స్టార్ట్ అయ్యింది. థమన్, కార్తీక్, గీతామాధురి జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షోలో స్పెషల్ ఎపిసోడ్‌లో బాలయ్య మరోసారి సందడి చేయనున్నారు. తాజా మేకోవర్ తో మరింత యంగ్ లుక్ లో మారిన బాలకృష్ణ తన లుక్ తో ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =