మీటర్ మాస్ సాంగ్ ప్రోమో రిలీజ్

mass beat song promo released from meter movie

వరుస సినిమాలతో దూసుకుపోతూ హీరోగా తన మార్క్ ను చూపిస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. రీసెంట్ గానే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కిరణ్ అబ్బవరం. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రమేశ్ కాడూరి దర్శకత్వంలో కిరణ్ హీరోగా వస్తున్న సినిమా మీటర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగా ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా నుండి మాస్ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. చమక్ చమక్ పోరి అనే మాస్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈపాటలో హీరో హీరోయిన్లు మాస్ స్టెప్పులతో అదరగొట్టేలా కనిపిస్తున్నారు. ఫుల్ సాంగ్ ను 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అతుల్య రవి కథానాయికగా తెలుగు తెరకి పరిచయమవుతోంది. 2017లోనే కోలీవుడ్ కి పరిచయమైన అతుల్య ఈ సినిమాతో ఇక్కడ ఎన్ని మార్కులు కొట్టేస్తుందనేది చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈసినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 6 =