ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్ కాలభైరవ, రాహుల్ సింప్లి గంజ్ లైవ్ పెర్ఫార్మెన్స్

RRR Naatu Naatu Song Live Performance At Oscars 2023

డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్స్ కు నామినేట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 12, 2023 న జరిగే ఆస్కార్ అవార్డు వేడుకకు ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా మెరిశారు. ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి దీపికా పదుకొనె ఆస్కార్స్ కి హాజరైన వారందరికీ బ్రీఫ్ గా వివరించారు. నాటు నాటు సాంగ్ గురించి చెప్పగానే ఆడిటోరియం మొత్తం కేరింతలు, చప్పట్లతో మారుమోగింది. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కై దీపికా పదుకొనె.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లని ఆహ్వానించారు. రాహుల్, కాలభైరవ హుషారెత్తించేలా నాటు నాటు సాంగ్ ని పాడుతూ పడుతూ ఆస్కార్ వేదికపై అదరగొట్టారు. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కి ఆస్కార్స్ లో స్టాండింగ్ ఒవేషన్ లభించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + two =