టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీకాంత్. ఎన్నో సూపర్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం అయితే శ్రీకాంత్ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇక శ్రీకాంత్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు తనయుడు రోషన్. నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రోషన్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆసినిమాలో నటనకి ఉత్తమ నటుడిగా సైమా అవార్డును సైతం గెలుచుకున్నాడు. ఆ తర్వాత అతను డాక్టర్ కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడి సినిమా చేసి తన ఎనర్జిటిక్ నటనతో మరోసారి మెప్పించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు రోషన్. వైజయంతీ మూవీస్ మరియు వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌లో తన తదుపరి సినిమాతో రాబోతున్నాడు. ఈనేపథ్యంలో నేడు తన పుట్టినరోజు సందర్భంగా తన కొత్త సినిమా అప్ డేట్ ను ఇచ్చారు. ఛాంపియన్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. ఈసందర్భంగా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ రోషన్ లుక్ మాత్రం ఆకట్టుకుంటుంది. మ్యాన్లీ లుక్ తో ఉన్న రోషన్ కొత్త మేకోవర్ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈసినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
Here’s wishing our ‘Champ’ #Roshann a very Happy Birthday.#Champion @PradeepAdvaitam @MickeyJMeyer @AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/E46ztppLf9
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.