ఈవారం విడుదలకానున్న సినిమాలు ఇవే ..

List Of Movie Releases This Week – 17th March 2023

ఈ శుక్రవారం రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మొదటిది టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి‘.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ కం యాక్టర్ అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు కావడం దానికి తోడు ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు దాసరి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించగా కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈసినిమాతో పాటు ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన ‘కబ్జ‘ చిత్రం. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈచిత్రంలో కన్నడ స్టార్ హీరోలు శివ రాజ్ కుమార్, సుదీప్ కీలక పాత్రల్లో కనిపించనుండడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4000 థియేటర్లలో ఈసినిమా విడుదలకానుంది. ఆర్ చంద్రు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన కన్నడ సినిమాలు ‘కెజియఫ్, కాంతారా, విక్రాంత్ రోణ తెలుగులోనూ సత్తా చాటడంతో ఈ కబ్జ కు ఇక్కడ కూడా మంచి హైప్ వుంది. మరి ఈ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here