నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాలో చైతు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే చైతు డబ్బింగ్ స్టార్ చేసిన అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను మార్చి 14వ తేదీన సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
& Yeah, The Wait is Over!🔥
Witness the #CustodyTeaser Blast on Mar 16th at 4:51 PM🌟💥
Here’s #Custody Teaser Tease
▶️https://t.co/MS65tNaLf3#CustodyOnMay12@chay_akkineni @vp_offl @IamKrithiShetty @thearvindswami @Ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @SS_Screens pic.twitter.com/yzx7TFvNUP
— Srinivasaa Silver Screen (@SS_Screens) March 13, 2023
కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.