అఫీషియల్ NBK 108 లో శ్రీలీల

Official Young Actress Sree Leela Joins In NBK 108 Shoot,Actress Sree Leela,Sree Leela,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Sree Leela Joins In NBK 108,Sree Leela In NBK 108,Sree Leela In NBK 108 Movie,NBK 108 Movie,NBK 108,NBK 108 Telugu Movie,NBK 108 Movie Update,Sree Leela,Sree Leela Movies,Sree Leela New Movie,Sree Leela Latest Movie,Sree Leela Latest News,Sree Leela Upcoming Movies,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna Movies,Sree Leela In Balakrishna NBK 108 Movie,Sreeleela Joins NBK 108 Shoot,NBK 108 Shoot,NBK 108 Movie Shooting,NBK 108 Movie Shooting Update,NBK 108 Latest Update,NBK 108 Movie Cast

టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పరాజయం లేకుండా వరుస విజయాలనే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమా నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తన మార్క్ కామెడీతోనే సినిమా చేస్తూ హిట్లను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసినిమాకు తన మార్క్ కామెడీని యాడ్ చేస్తూనే మరోవైపు పవర్ ఫుల్ కథను అనిల్ సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఎప్పటినుండో శ్రీలీల కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఈవిషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో శ్రీలీల నటిస్తున్నట్టు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటించారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో శ్రీలీల జాయిన్ అయింది. ఈ సందర్భంగా శ్రీలీల, బాలకృష్ణ చేయి పట్టుకున్నట్లుగా వున్న బ్యూటీఫుల్ స్టిల్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీరితో పాటు ప్రియాంక్ జవాల్కర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =