కూతురికి చిరు మెగా గిఫ్ట్

Megastar Gifted A Costly Gift To His Daughter Sushmitha,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Megastar Chiranjeevi,Women’s Day,Women’s Day 2023,Happy Women’s Day,Chiranjeevi’s Gift To His Daughter,Megastar Chiranjeevi Gifted Durga Matha Souvenir To His Daughter,Chiranjeevi Gifted Durga Matha Souvenir To His Daughter Sushmita Konidela,International Womens Day,Chiranjeevi Gifted Durga Matha Souvenir To Sushmita Konidela,Sushmita Konidela,Chiranjeevi Gift To Daughter Sushmita,Chiranjeevi Gift,Chiranjeevi And Sushmita Konidela,Chiranjeevi And Sushmita Konidela,Chiranjeevi And Sushmita Konidela Latest Photo,Chiranjeevi Women’s Day Wishes

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా చిరు తన కూతురు సుస్మితకు ఖరీదైన బహుమతిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని సుస్మిత తన సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తూ ఫొటోలను పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. కాగా మెగా స్టార్ చిరంజీవి తనయ సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి చాలా సినిమాలకు తను కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది. రీసెంట్ గా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఇక ఈ సినిమాలో చిరు లుక్స్.. క్యాస్టుమ్స్ పట్ల సుస్మిత ప్రశంసలు కూడా అందుకున్నారు. అటు కాస్ట్యూమ్ డిజైనర్ గా.. ఇటు నిర్మాత రాణిస్తూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.