లారెన్స్ రుద్రుడు షూటింగ్ కంప్లీట్

Lawrence Rudhrudu Movie Shooting Completed,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Raghava Lawrence,Rudhrudu,Rudhrudu Movie,Rudhrudu Telugu Movie,Rudhrudu Movie Shooting Update,Rudhrudu Movie Latest Shooting Update,Rudhrudu Movie Shooting Latest News,Rudhrudu Movie Shooting Completed

ఇండస్ట్రీలోకి డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత తమిళ్, తెలుగులో ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసి ఎన్నో సూపర్ హిట్ లను అందుకున్నాడు రాఘవ లారెన్స్. అలా డ్యాన్స్ మాస్టర్ స్థాయి నుండి పలు సినిమాల్లో కీలక పాత్రలను చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా డైరెక్టర్ గా ఇలా అన్నింటిలోనూ తన మార్క్ ను చూపించాడు. ఇక ముని సినిమా తరువాత హార్రర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముని తరువాత కాంచన, గంగ, కాంచన 3 ఇలా వరుసగా హార్రర్ సినిమాలు తీశాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు లారెన్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కదిరేశన్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. ఈసినిమా గత కొద్దికాలంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా గ్లంప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేస్తూ టీమ్ మొత్తం ఉన్న ఒక ఫొటోను పోస్ట్ చేసింది.

కాగా ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ మూవీ లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగుతో పాటు మలయాళ , కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 9 =