అఫీషియల్ – NTR 30 లో జాన్వీ కపూర్

Official Janhvi Kapoor To Act In NTR 30,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR NTR 30,NTR 30 Movie,NTR 30 Telugu Movie,NTR 30 Movie Update,NTR 30 Movie News,NTR 30 Heroine,Janhvi Kapoor In NTR 30,Janhvi Kapoor In NTR 30 Movie,Janhvi Kapoor,HBD Janhvi Kapoor,Happy Birthday Janhvi Kapoor,Janhvi Kapoor Movies,Janhvi Kapoor New Movie,Janhvi Kapoor Telugu Movies,Koratala Siva,NTR 30 Janhvi Kapoor First Look,Janhvi Kapoor NTR 30 First Look,Janhvi Kapoor To Act In NTR 30

మొత్తానికి ఎన్నో రోజుల నుండి సస్పెన్స్ లో ఉన్న ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. గత కొంతకాలంగా ఎన్టీఆర్ 30లో హీరోయిన్ గా అలనాట అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో నిజం లేదు కేవలం వార్తలు మాత్రమే అని కూడా అన్నారు. అలా చాలా కాలంపాటుగా జాన్వీ కపూర్ నటిస్తుందా?లేదా? అన్న కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈసినిమాలో జాన్వీకపూర్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ రోజు జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆమె నటిస్తున్నట్టు తెలుపుతూ.. టీమ్ ఆమెకి విషెస్ తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో జాన్వీ కపూర్ లంగా ఓణిలో ట్రెడిషనల్ గా కనిపిస్తుంది. మరి తెలుగులో అరంగేట్రం చేస్తున్న జాన్వీ కపూర్ కు తెలుగు పరిశ్రమ ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన 30 వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. అయినా కూడా ఈసినిమా ఇంతవరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం కొరటాల ఈసినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటించే ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + five =