ఖుషి- యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ షురూ

Latest Update On Vijay Devarakonda And Samantha Starrer Kushi Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Devarakonda,Vijay Devarakonda Movies,Vijay Devarakonda New Movie,Samantha,Samantha Movies,Samantha New Movie,Kushi,Kushi Movie,Kushi Telugu Movie,Kushi Movie Update,Kushi Movie Latest News,Kushi Movie Shooting Update,Kushi Movie Latest Shooting Update,Vijay Devarakonda Kushi Movie Latest Shooting Update,Vijay Devarakonda Kushi Movie Shooting Update,Vijay Devarakonda Kushi Movie,Vijay Devarakonda Kushi

శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. అయితే మధ్యలో సమంత వేరే సినిమాలతో బిజీగా ఉండటం.. అందులోనూ అనారోగ్యానికి గురవ్వడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే కదా. వచ్చిన వార్తలను బట్టి సమంత కూడా రేపటి నుండి షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ శివ నిర్వాణ. తిరిగి షూటింగ్ ను ప్రారంభిస్తున్నట్టు.. యాక్షన్ సీక్వెన్స్ తో ఈసినిమా షూటింగ్ తిరిగి ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + 20 =