ఈ ఏడాది హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి లుక్స్ ను రిలీజ్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈసినిమాలో సుధీర్ బాబు డిఫరెంట్ లుక్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాత్ర దుర్గను పరిచయం చేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. పరుశురామ్ అనే మరో పాత్రలో నటిస్తుండగా.. ఈ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“You can find him in your shadow”
Here’s the Terrific Second Look of @isudheerbabu as #Parasuram from #MaamaMascheendra 🔥#SBasParasuram @HARSHAzoomout @YoursEesha @mirnaliniravi @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/MCoa5tYppZ
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 4, 2023
కాగా ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు పీజీ విందా సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈసినిమాను తెలుగుతో పాటు హిందీ లో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: