నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే గత ఏడాది బింబిసార అనే సినిమాతో వచ్చాడు. ఈసినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో నటించి అలరించాడు. ఇక రీసెంట్ గా అమిగోస్ సినిమాతో వచ్చాడు. ఈసినిమా ఏకంగా మూడు పాత్రలతో అలరించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈసినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారట. మరి దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వస్తుందేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజి, సప్తగిరి, రవి ప్రకాష్, శివన్నారాయణ, చైతన్య కృష్ణ, రఘు కారుమంచి, కళ్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్, సోనాక్షి వర్మ తదితరులు నటించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈసినిమాకుసంగీతం జిబ్రాన్ సంగీతం, సినిమాటోగ్రఫి ఎస్.సౌందర్ రాజన్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: