ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉండటం వల్లే ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాల్సిన ఈసినిమా ఇప్పటివరకూ పూర్తి చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అయితే షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక రీసెంట్ గానే సముద్రఖని తో ఒక సినిమాను కమిట్ అయ్యాడు. ఈసినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వినోదయ సితం అనే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా షూటింగ్ ను కూడా అప్పుడే మొదలుపెట్టేశారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా హరీష్ శంకర్ తో పవన్ ఒక సినిమా చేస్తున్న సంగతి కూడా విదితమే. గబ్బర్ సింగ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా త్వరలో మొదలుపెట్టనున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభానికి డేట్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మార్చి 30 వ తేదీన శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ అందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరి చూద్దాం ఈవార్తలో ఎంత నిజముందో..
కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన పూజా హెగ్డే నటించనుంది. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మరి చూద్దాం ఈసారి పవన్ తో హరీష్ శంకర్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: