ఇండస్ట్రీ లో 45 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సుమన్ కు చిరంజీవి స్పెషల్ విషెస్

Chiranjeevi Congratulates Suman On Completing 45 Years In Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi New Projects,Chiranjeevi Latest Projects,Chiranjeevi Upcoming Projects,Chiranjeevi Next Projects,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Suman,Actor Suman,Hero Suman,Suman Completes 45 Years In Film Industry,45 Years Of Suman,45 Years For Suman,45 Years Of Suman In Film Industry,Chiranjeevi Congratulates Suman On 45 Years In Film Industry,Chiranjeevi Congratulates Suman,Chiranjeevi About Suman,Megastar Chiranjeevi Great Words About Actor Suman,Chiranjeevi Great Words About Actor Suman,Chiranjeevi About Actor Suman,Chiranjeevi Comments On Suman

నీచల్ కుళం (1979) మూవీతో కోలీవుడ్ లో సుమన్ కెరీర్ ప్రారంభించారు. పలు తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సుమన్ ఇద్దరు కిలాడీలు (1982 ) మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుమన్ ప్రేక్షకులను అలరించారు. బావ బావమరిది మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుమన్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు. వెంకటేశ్వర స్వామి, శివుడు, రాముడు గా పౌరాణిక పాత్రలలో సుమన్ అలరించారు. ఒక టైమ్ లో సుమన్, హీరోలు చిరంజీవి, బాలకృష్ణలకు గట్టి పోటీ ఇచ్చారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో సుమన్ 45 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. సుమన్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బెంగళూరులో వేడుక జరగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా సుమన్ కు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఒక వీడియో ద్వారా ప్రత్యేకంగా గ్రీటింగ్స్ చెప్పారు. మైడియర్ సుమన్ సినీ పరిశ్రమలో నీవు 45 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందనీ, మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాననీ.. సినిమాలపై నీకున్న కమిట్మెంట్ ఏమిటో నీవు నటించిన చిత్రాలే చెపుతాయనీ.. పలు భాషల్లో150 కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నువ్వు ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే లక్షలాది ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తావని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. బెంగుళూరులో ఫిబ్రవరి 16న జరుగబోతున్న 45 ఇయర్స్ ఈవెంట్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానంటూ చిరంజీవి చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.