సుకుమార్ దగ్గర శిష్యరికం చేసి మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు బుచ్చిబాబు. ఇక ఈసినిమా తరువాత ఈసినిమాలో హీరో హీరోయిన్స్ గా చేసిన కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటివరకూ మరో సినిమాను లైన్ లో పెట్టలేదు. రీసెంట్ గానే తన రెండో సినిమాపై క్లారిటీ వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చిబాబు తన రెండో సినిమాను తీయనున్నాడు. ప్రస్తుతం ఆయితే ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు బుచ్చిబాబు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు బుచ్చిబాబు పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నా అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా.. త్వరలో సెట్స్ లో కలుద్దాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.
Happiest birthday to one of my fondest directors @BuchiBabuSana !!
Wishing an incredibly happy and healthy year ahead.See you on sets soon!❤️ pic.twitter.com/ZuWTLa3fRZ
— Ram Charan (@AlwaysRamCharan) February 15, 2023
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: