ఒకప్పటిలా కాకుండా ఇప్పుడు హీరోయిన్స్ కెరీర్ లో బిజీగా ఉన్నా కూడా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న తరువాత సినిమాలు చేసుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఎంతో మంది హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ రణ్ బీర్, అలియా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మరో బాలీవుడ్ స్టార్ జంట కూడా వివాహబంధంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పెళ్లి చేసుకొని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. వీరిద్దరూ ఎప్పటినుండో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే కదా.. అయితే వీరిద్దరూ ఎప్పుడూ అధికారికంగా ప్రకటించింది మాత్రం లేదు. ఇక ఫైనల్ గా బంధుమిత్రుల సమక్షంలో పెళ్లితో వీరిద్దరూ ఒకటయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #RC15 #SVC50 wishes @SidMalhotra and @advani_kiara a very happy married life!
Wishing you a lifetime of happiness, love and light❤
Megapower Star @AlwaysRamCharan @shankarshanmugh @DOP_Tirru @MusicThaman @SVC_official pic.twitter.com/GsppqJ8sgI
— Sri Venkateswara Creations (@SVC_official) February 13, 2023
ఇక వీరిద్దరికీ ఆర్సీ 15 టీమ్ బెస్ట్ విషెస్ అందించారు. ఆర్సీ 15 టీమ్ మొత్తం చిన్న వీడియో ద్వారా కియారా-సిద్దార్థ్ కు బెస్ట్ విషెస్ అందించారు. కాగా ఆర్సీ 15 సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: