సినిమాల్లోనే కాదు మన హీరోలు అవసరం వచ్చినప్పుడు రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా మారుతుంటారు. ముఖ్యంగా మన ఇండస్ట్రీలో హీరోలకు-అభిమానులకు మధ్య ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో తెలిసిందే. తమ అభిమాన హీరోలను ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ప్రేమిస్తారో.. అలాగే హీరోస్ కూడా తమ అభిమానులను అలానే ప్రేమిస్తారు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఓ బుల్లి అభిమాని కోరిక తీర్చాడు. మణి కౌశల్ అనే పిల్లాడు గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే మణి కౌశల్ రామ్ చరణ్ వీరాభిమాని. మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా రామ్ చరణ్‌కు ఆ చిన్నారి పరిస్థితిని వివరించారు. దీంతో చిన్నారి అభిమానిని రామ్ చరణ్ స్వయంగా కలిసి కాసేపు సమయం గడిపి ఆ చిన్నారిలో మనో స్ఠైర్యం ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం రామ్ రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఆర్సీ 15. లెజెండ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం శంకర్ సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు రామ్ చరణ్. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా తరువాత బుచ్చిబాబు తో సినిమా చేయనున్నాడు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: