తమిళ్ హీరో విజయ్ ఆంటోని తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక బిచ్చగాడు సినిమాతో ఒక్కసారిగా తన రేంజ్ మార్చేసుకున్నాడు విజయ్ ఆంటోని. శశి దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘పిచైకారన్’. 2016లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించి విజయ్ ఆంటోని సినీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమానే తెలుగులో ‘బిచ్చగాడు’ అనే టైటిల్ తో విడుదల చేశారు. ఇక ఇక్కడ కూడా ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ఇటీవలే ఈసినిమా షూటింగ్ సమయంలో విజయ్ ఆంటోని గాయపడిన సంగతి తెలిసిందే కదా. మలేషియాలోనే చికిత్స చేయించి ఆ తరువాత చెన్నై తీసుకొచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా స్నీక్ పీక్ ట్రైలర్‌ను రేపు విడుదల చేస్తున్నట్టు విజయ్ ఆంటోని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ విడుదలవుతుంది. ఈ సినిమాలో మొదటి 4 నిమిషాల ఓపెనింగ్ సీన్‌ను స్నీక్ పీక్ ట్రైలర్‌గా తీసుకొస్తున్నట్టు తెలిపారు.
Money is Injurious to The World💣💀
பணம் உலகை காலி பண்ணிடும் 💣💀
డబ్బు లోకాన్ని ఖాళీ చేస్తుంది💣💀#ANTIBIKILI 👺
1st 4️⃣ mins of #Pichaikkaran2 #Bitchaagaadu2 Sneak Peek Trailer 😈 will be out tomorrow at 5️⃣ PM#Summer2023🔥@vijayantony pic.twitter.com/CUxOdTPyny
— VijayAntonyFilmCorporation (@vijayantonyfilm) February 9, 2023
ఇంకా ఈసినిమాలో విజయ్ ఆంటోని హీరోగా నటించడమే కాకుండా ఈసినిమాకు దర్శకత్వం బాధ్యతలు కూడా తీసుకున్నారు. అంతేకాదు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ఇక కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, రాజా కృష్ణమూర్తి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓం నారాయణన్ అందిస్తున్నారు. ఫాతిమా విజయ్ ఆంథోనీ ‘విజయ్ ఆంథోనీ ఫిల్మ్ కార్పొరేషన్’ పతాకంపై ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి ఈసినిమాను విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: