మొత్తానికి మంచి విజయం కోసం ఎదురుచూస్తున్న మాస్ మహారాజా రవితేజ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ హ్యాపీలో ఉన్నాడు. గత ఏడాది చివరిలో రవితేజ నుండి వచ్చిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య అయితే బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఈసినిమాలో రవితేజ ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక ఇప్పుడు రవితేజ తన కొత్త సినిమాలను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ లిస్ట్ లో టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు ఉన్నాయి. ఇక వీటిలో రావణాసుర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు రవితేజ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా రావణాసుర సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రవితేజ పుట్టిరోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జనవరి 26వ తేదీన ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయనున్నారు.
Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎
A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥
Stay Tuned ❤️🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX
— RT Team Works (@RTTeamWorks) January 24, 2023
కాగా ఈసినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్, ఆర్ టి టీమ్‌వర్క్స్ గ్రాండ్ స్కేల్ లో నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్ గా, శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈసినిమాను ఏప్రిల్ 7 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.