తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన సినిమా వారిసు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా కాలం తరువాత ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో ముందుకు వచ్చాడు విజయ్. ఈసినిమా తెలుగులో వారసుడు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక ఇక్కడ జనవరి 14వ తేదీన ఈసినిమా రిలీజ్ అయింది. ఈసినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం తగ్గేదేలే అంటుంది. ఈసినిమా రిలీజ్ అయిన 5రోజుల్లోనే 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. అయినా కూడా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోయింది. వారం రోజుల్లో ఈసినిమా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకొని 200 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Triple ah received your love in 7 days nanba 🔥#MegaBlockbusterVarisu crosses 210Crs+ collection worldwide 😎#VarisuHits210Crs#Thalapathy @actorvijay sir @directorvamshi @SVC_official @MusicThaman @iamRashmika @7screenstudio @TSeries#Varisu #VarisuPongal pic.twitter.com/aVS6vGYhhY
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2023
ఈసినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించరు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.