భోళా శంకర్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం

Megastar Chiranjeevis Bhola Shankar Movie Shooting Restart, Bhola Shankar Movie Shooting Restart, Megastar Chiranjeevis Bhola Shankar Movie, Bhola Shankar Movie Shooting, Bhola Shankar Movie Solid Update, Megastar Chiranjeevi, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Murali Sharma, Mahathi Swara Sagar, Meher Ramesh, Chiranjeevi Movies, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Bhola Shankar, Bhola Shankar 2023, Bhola Shankar Movie, Bhola Shankar Update, Bhola Shankar Latest News, Bhola Shankar Telugu Movie, Bhola Shankar Movie Live Updates, Bhola Shankar Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మెగాస్టార్ చిరంజీవి అప్పుడే బిజీ అయిపోయారు. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నారు. ఈసినిమా రిలీజ్ అయిన మూడురోజుల్లోనే 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతవరకూ వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్న చిరు ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం చిరు చేస్తున్న సినిమా భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ను ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ అప్పుడు ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం వరకూ షూటింగ్ పూర్తయిందని.. జనవరి 17 నుండి ఈసినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెడతామని తెలిపారు. ఇక చెప్పినట్టే నేడు కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారు చిత్రయూనిట్. ఈవిషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్. భారీగా వేసిన కోల్ కత్తా సెట్ లో నేటినుండి షూటింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపారు.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =