వాల్తేరు వీరయ్య లో నాన్నగారిని చూస్తుంటే పండగలా వుంది

Sushmita Konidela About Her Father Role In Waltair Veerayya, Sushmita Konidela About Her Father, Sushmita Konidela About Waltair Veerayya, Chiranjeevi Waltair Veerayya Movie Hungama, Waltair Veerayya Movie Hungama, 2023 Latest Telugu Reviews, Bobby Kolli, Catherine Tresa, DSP, Latest telugu movie reviews, Latest Telugu Movies 2023, Latest Telugu Reviews, Latest Tollywood Reviews, Megastar Chiranjeevi, New Movie Reviews, New Telugu Movie Reviews 2023, New Telugu Movies 2023, Ravi Teja, Shruti Haasan, Telugu cinema reviews, Telugu Filmnagar, Telugu Movie Ratings, telugu movie reviews, Telugu Movie Reviews 2023, Telugu Movies 2023, Telugu Reviews, Telugu Reviews 2023, Tollywood Reviews, Waltair Veerayya, Waltair Veerayya (2023 film), Waltair Veerayya (2023) – Movie, Waltair Veerayya (film), Waltair Veerayya (Telugu) (2023) – Movie, Waltair Veerayya 2023, Waltair Veerayya Critics Review, Waltair Veerayya First Review, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie – Telugu, Waltair Veerayya Movie (2023), Waltair Veerayya Movie Highlights, Waltair Veerayya Movie Plus Points, Waltair Veerayya Movie Public Response, Waltair Veerayya Movie Public Talk, Waltair Veerayya Movie Review, Waltair Veerayya Movie Review And Rating, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Review, Waltair Veerayya Review – Telugu, Waltair Veerayya Story review, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie Review, Waltair Veerayya Telugu Review

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన వాల్తేరు వీరయ్య అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి మెగామాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసిన సుస్మిత కొణిదెల విలేఖరుల సమావేశంలో వాల్తేరు వీరయ్య విశేషాలని పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ చాలా కలర్ ఫుల్ గా అందంగా ఉన్నాయి. దీనికోసం మీరు చేసిన రీసెర్చ్ గురించి చెప్పండి ?
ఈ కథ విన్నపుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. దర్శకుడు బాబీ కథ చెబుతున్నపుడు నా ఆలోచనలు చాలా వరకూ మ్యాచ్ అయ్యాయి. వాల్తేరు, పోర్ట్ , ఫిషర్ మ్యాన్ అని చెప్పగానే ఒక ఇమాజినేషన్ వచ్చింది. బాబీ గారు ముఖ్యంగా చెప్పిన విషయం ఏమిటంటే.. మాకు వింటేజ్ చిరంజీవి గారి లుక్ కావాలని చెప్పారు. మేము ఆయన్ని ఎలా చూస్తూ పెరిగామో .. అలా వింటేజ్ గ్యాంగ్ లీడర్ .. లాంటి లుక్ కావాలని చెప్పారు. నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. అలాగే ఈ సినిమాలో రవితేజ గారికి, శృతి హాసన్ గారికి వారివారి డిజైనర్స్ పని చేశారు. అందరం ఒక మంచి సమన్వయంతో పని చేశాం.

నాన్నగారి కాస్ట్యూమ్స్ కోసం ఆయనతో చర్చిస్తుంటారా ?
తప్పకుండా నాన్నగారితో చర్చిస్తా. ఆయనకి వున్న అనుభవంతో ఒక సీన్ లో ఎలా కనిపించాలో ఆయనకే బాగా తెలుసు. ఇందులో కూడా ఆయన సూచనలు ఇచ్చారు. లుంగీ డిజైన్, ఎక్కడ ఎలాంటి కళ్ళజోడు వుంటే బావుంటుందనే కొన్ని సూచనలు ఇచ్చారు.

ఇందులో చిరంజీవి గారి లుక్స్ వింటేజ్ తో పాటు ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు ఉన్నాయి.. ఈ విషయంలో ఏదైనా రీసెర్చ్ చేశారా ?
వింటేజ్ లుక్ తీసుకురావాలి. అలా అని ఇది పిరియడ్ సినిమా కాదు కదా. యువతకు కూడా నచ్చేలా చేయాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ పై అవగాహన ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ని మిక్స్ చేస్తూ ఆయనకు నప్పే డిజైన్స్, షర్ట్స్ ప్రత్యేకంగా రూపొందించాం.

వాల్తేరు వీరయ్యగా నాన్నగారిని తెరపై చూసినప్పుడు ఎలా అనిపించింది ?
ఇది నాన్నగారి మోస్ట్ కంఫర్ట్బుల్ జోన్. చూస్తున్నపుడు అద్భుతంగా అనిపించింది. ఒక పెద్ద పండగలా అనిపించింది. నిజానికి ఈ సినిమా షూటింగ్ కి వెళ్తున్న ప్రతి రోజూ పండగలానే వుండేది.

ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా వుంది ?
అమ్మ లుక్ టెస్ట్ చేసినప్పుడే ఏది బావుంటుందో చెప్పేస్తుంది. అమ్మ ఇన్ పుట్స్ చాలా వుంటాయి. అలాగే ఎలా ఉన్నా చరణ్ తప్పకుండా కాల్ చేస్తాడు.

నాన్నగారు సినిమాలు ఫ్యాన్స్ మధ్యలో కూర్చుని చూస్తున్నపుడు విజిల్స్ వేస్తుంటారా ?
ఇందులో ఎలాంటి మొహమాటాలు లేవు. ఆయన అభిమానిగా మేము చేసే పనే అది. ఉదయం నాలుగు గంటలకి టీం అందరితో కలసి షోకి వెళ్ళాం. అభిమానులతో పాటు ఈలలు గోలలు అరుచుకుంటూ వచ్చాం. (నవ్వుతూ)

చిరంజీవి గారు చాలా ఫిట్ గా కనిపించారు ? లుక్ విషయంలో మీరేమైనా ఫిట్ నెస్ టిప్స్ ఇచ్చారా ?
ఈ విషయంలో నా కాంట్రిబ్యూషన్ ఏమీ లేదండీ. ఆయన హార్డ్ వర్క్ చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. ఫిట్ గా వుండేవాళ్ళ కాస్ట్యూమ్స్ బావుంటాయి. దానిని మైండ్ లో పెట్టుకొని ఇన్నాళ్ళు ఆయన మెంటైన్ చేస్తూ వచ్చారు. హెల్త్ పట్ల ఆయన చాలా స్పృహతో వుంటారు.

డిజైనర్ గా ఉంటూనే నిర్మాణం పై దృష్టి పెట్టారు కదా.. నాన్నగారి సినిమా చేసే ఆలోచనలు ఉన్నాయా ?
నాన్నగారు లాంటి స్టార్ తో పని చేయాలని అందరి నిర్మాతలకు ఉంటుంది. అందరి నిర్మాతలకు చెప్పినట్లే నాకు కూడా ముందు మంచి కథ తీసుకురా వెంటనే చేద్దాం అంటారు. మేము కూడా ఆ వేటలోనే ఉన్నాం.

చిరంజీవి గారు..ఇందులో ఇరవై ఏళ్ళు వయసు తగ్గినట్లు కనిపించారు.. డిజైనర్ గా ఈ విషయంలో మీరేమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా ?
నాన్నగారు తన లుక్ ని యాటిట్యూడ్ ని యంగ్ చేసుకుంటూ వచ్చారు. నేను దానిని క్యాచప్ చేశానంతే.

రంగస్థలంలో రామ్ చరణ్ మాస్ గా డిజైన్ చేశారు.. ఇప్పుడు నాన్నగారు .. ఎవరు అద్భుతంగా చేశారని అనుకుంటున్నారు ?
ఖచ్చితంగా నాన్నగారే. నాన్నగారంత చక్కగా ఈ మాస్ లుక్ ని మరొకరు చేయలేరని భావిస్తున్నాను.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ ?
భోళా శంకర్ జరుగుతోంది. అలాగే రెండు వెబ్ సిరీస్ లపై వర్క్ చేస్తున్నాం. అలాగే ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చర్చలు జరుగుతున్నాయి. శ్రీదేవి శోభన్ బాబు సినిమా విడుదలకు సిద్దంగా వుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =