ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసిందే కదా. ఇప్పుడు ఏకంగా తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాణ సంస్థతో చేతులు కలిపి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న హీరోగా వారిసు. ఈసినిమా తెలుగులో వారసుడు అనే టైటిల్ తో రానుంది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. విజయ్, రష్మిక మందన్న, శరత్ కుమార్, శ్రీకాంత్, శ్యామ్, ప్రకాశ్ రాజ్, సంగీత, జయసుధ, ప్రభు, యోగిబాబు, నందిని రాయి, తదితరులు
దర్శకత్వం.. వంశీ పైడిపల్లి
బ్యానర్స్.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి సినిమా
నిర్మాతలు.. దిల్ రాజు
సంగీతం.. థమన్
సినిమాటోగ్రఫి.. కార్తీక్ పలని
కథ..
రాజేంద్రన్ (ఆర్ శరత్ కుమార్) పెద్ద బిజినెస్ మ్యాన్. అతనికి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఒకరు జై (శ్రీ కాంత్) మరొకరు అజయ్ (శ్యామ్) మూడో కొడుకు విజయ్ రాజేంద్రన్ (విజయ్). అయితే వీరిలో జై, అజయ్ తండ్రి అడుగుజాడల్లో నడుస్తుంటారు. విజయ్ మాత్రం తండ్రికి విరుద్దంగా ప్రవర్తిస్తుంటాడు. ఈనేపథ్యంలోనే ఒకరోజు గొడవ వల్ల విజయ్ రాజేంద్రన్ ఇంట్లో నుండి వెళ్లిపోతాడు. అలా ఇంటినుండి దూరమైన విజయ్ ఏడేళ్ల తరువాత తిరిగి ఇంటికి వస్తాడు. అదే సమయంలో కుటుంబంతో పాటు వ్యాపారంలో కూడా సమస్యలు వస్తుంటాయి. మరి తన తండ్రితో గొడవపడి ఇంట్లోంచి వెళ్లిపోయిన విజయ్ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు? తిరిగి వచ్చాక తన ఇంటి పరిస్థితిని ఎలా మార్చాడు? తన తండ్రి బిజినెస్ కి విజయ్ వారసుడయ్యాడా? జయప్రకాశ్ (ప్రకాష్ రాజ్) మరియు ముఖేష్ (గణేష్ వెంకట్ రామన్) ఎందుకు రాజేంద్రన్ కుటుంబానికి హాని తలపెట్టాలని అనుకుంటున్నారు? విజయ్ తన కుటుంబాన్ని కాపాడగలిగాడా? చివరికి ఏమైంది? అనేది ఈసినిమా కథ.
విశ్లేషణ..
తమిళ్ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు తెలుగులో మరింత మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. అందుకే తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేస్తున్నారు.. అంతేకాదు తెలుగు మేకర్స్ తో పనిచేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు తమిళ్ హీరోలు తెలుగు డైరెక్టర్స్, మేకర్స్ తో చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. తెలుగులో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కూడా తన డబ్బింగ్ సినిమాలు ఎన్నో సూపర్ హిట్లను అందుకున్నాయి. తాజాగా విజయ్ నటించిన సినిమా వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సినిమా దర్శకుడు, నిర్మాతలు అంతా తెలుగోళ్లే.
ఈసినిమా కథను చూస్తే.. ఇప్పటివరకూ ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. గాడిలో లేని ఇంటిని గాడిలో పెట్టడానికి హీరో పూనుకోవడం నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ఈసినిమా కథ కూడా ఇదే.. అయితే కాస్త కొత్తగా చూపించాడు వంశీ పైడిపల్లి. ఇక ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ మధ్య నడిచే పోరుగా సినిమాను నడిపించారు. వంశీ పైడిపల్లి సినిమాని చాలా వరకు ఎమోషన్, కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ తోనే ముందుకు తీసుకువెళ్లారు. స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా ఎమోషన్స్ విషయం లో చాలా కేరింగ్ తీసుకున్నాడు.. అందుకే ఈ సినిమా సంక్రాంతికి వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది..
పెర్ఫామెన్స్..
విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా విజయ్ పరకాయ ప్రవేశం చేయగలడు. ఇక ఈసినిమాలో కూడా విజయ్ తన నటనతో మెప్పించాడు. సినిమా మొత్తాన్ని విజయ్ తన భుజాల మీద వేసుకొని నడిపించాడు. రష్మిక మందన నటన ఓకే అనిపిస్తుంది. ఇక ఈసినిమాకు జయసుధ నటన కూడా ప్లస్ పాయింట్. ఆమె తెరపై ఉన్నంతసేపు సినిమా చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఆర్ శరత్ కుమార్ కూడా తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ప్రకాష్ రాజ్ కూడా చాలా బాగా నడిచారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
టెక్నికల్ వాల్యూస్..
ఇక సాంకేతిక విభాగానికి వస్తే థమన్ సంగీతం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సినిమా రిలీజ్ కు ముందే పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు బాగా ఇచ్చాడు. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రాఫర్ సినిమాకి మంచి కలర్ ఫుల్ మరియు బ్రైట్ విజువల్స్ ను అందించారు. దిల్ రాజు ప్రొడ్యూసర్ కాబట్టి నిర్మాణ విలువలకు వంక పెట్టాల్సిన అవసరం లేదు.
ఓవరాల్ గా చెప్పాలంటే సంక్రాంతికి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు ఈసినిమా.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: