గీతా ఆర్ట్స్ చేతిలో మలయాళం హిట్ మూవీ

Geetha Arts To Release Malayalam Hit Film In Telugu, Malayalam Hit Film In Telugu, Geetha Arts To Release Malayalam Hit Film, Geetha Film Distributors, Unni Mukundan, Alphy Panjikaran, Sampath Ram, Saiju Kurup, Vishnu Sasi Shankar, Unni Mukundan Movies, Unni Mukundan Latest Movie, Unni Mukundan Upcoming Movie, Malikappuram, Malikappuram 2023, Malikappuram Movie, Malikappuram Update, Malikappuram Latest News, Malikappuram Telugu Movie, Malikappuram Movie Live Updates, Malikappuram Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. విష్ణు శశి శంకర్‌ దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో ఉన్ని కృష్ణన్ ప్రధానం పాత్రలో వచ్చిన సినిమా మాలికాపురం. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ 30 వ తేదీన వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హక్కులను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్స్ట్ సంస్థ వారు సొంతం చేసుకొని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. జనవరి 21న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ గీతా ఆర్ట్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈమధ్య గీతా ఆర్స్ట్ వారు ఇక్కడ సినిమాలు నిర్మిస్తూనే ఇతర భాషల్లోని సినిమాలను కూడా ఇక్కడ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రీసెంట్ గానే కాంతార సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. మరి ఈసినిమా ఇక్కడ ఎంత సంచలన విజయం దక్కించుకుందో చూశాం.

కాగా ఇంకా ఈసినిమాలో మాలికాపురంలో సజ్జు కురూప్‌, మనోజ్‌ కే జయన్‌, రంజి పానికర్‌, రమేశ్‌ పిషరోడి ఇతర కీలక పాత్రలు పోషించారు. రజినీ రాజ్‌ సంగీతం, విష్ణు నారాయణన్ నంబూతిరి సినిమాటోగ్రఫి అందించారు. అంటోన్ జోసెఫ్ యాజమాన్యంలోని యాన్ మెగా మీడియా మరియు వేణు కున్నపిల్లి యాజమాన్యంలోని కావ్య ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈసినిమాను నిర్మించాయి. మరి మలయాళంలో హిట్ అయిన ఈసినిమా ఇక్కడ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూద్దాం..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 3 =