మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్, రవితేజ టీజర్, 5 సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారీ హైప్ క్రియేట్ అయిన వాల్తేరు వీరయ్య మూవీ తెలుగు రాష్ట్రాలలో 1200 థియేటర్స్, అమెరికాలో 1200 స్క్రీన్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. తెలంగాణలో ఆరు షోలకు అనుమతి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజామున 4 గంటలకే షోలు థియేటర్లలో పడ్డాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో తెల్లవారుజామున 4 గంటలకే సినిమా షో పడింది. థియేటర్ కు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి సందడి చేశారు. మెగా అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జై చిరంజీవి, స్టార్.. స్టార్ మెగా స్టార్ అన్న నినాదాలతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు మార్మోగుతోంది. అభిమానులతో కలిసి చిత్ర యూనిట్ సినిమా చూస్తోంది. వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ బాబీ, దర్శకుడు హరీశ్ శంకర్ సంధ్య థియేటర్ కు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత, శ్రీజ సైతం థియేటర్ లో సందడి చేశారు. అభిమానులతో కలిసి మూవీ చూస్తూ ఎంజాయ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: