మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. అయితే ఈమధ్య చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిరు వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చిరు భోళా శంకర్ గురించి చెప్పారు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే 30 శాతం పూర్తయిందని.. జనవరి 17 నుంచి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభంకాబోతున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు షూటింగ్ పూర్తయితే మే నెలలో భోళా శంకర్ మూవీ థియేటర్లలోకి వస్తుందని.. ఒకవేళ మే నెలలో రిలీజ్ చేయలేకపోతే.. దసరాకి మాత్రం పక్కాగా రిలీజ్ చేస్తామని చిరంజీవి స్పష్టం చేశారు. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో..
కాగా ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: